తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తెలిసినప్పటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, స్టార్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ మధ్య ట్విట్టర్ వేదికగా మినీ వార్ జరుగుతోంది. తాజాగా ప్రకాశ్ రాజ్, పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో, "తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి సమానత్వం గురించి మాట్లాడుతున్నారు, మాది సమానత్వం. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరఫున మాట్లాడతా" అని పేర్కొన్నారు.