ప్రస్తుత తరుణంలో సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తూ. గో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ బుధవారం సూచించారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి షేర్ చేయడం గాని, సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే కాల్స్, మెసేజ్లకు ఎట్టి పరిస్థితులలోను స్పందించవద్దన్నారు. అపరిచిత వ్యక్తులను నమ్మి ఆన్లైన్లో డబ్బులు పంపించడం చేయరాదని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.