రాజమండ్రి రూరల్ మండలంలోని రాజవోలు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా ప్రవేశపెట్టిన అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో రైతులకు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తున్నారో తెలుసుకున్నారు. రాష్ట్ర, కేంద్ర పథకాలకు రిజిస్టర్ నమోదు కచ్చితంగా ఉండాలని రైతులకు తెలియజేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.