కత్తి కట్టి కోడిపందేలు వేయడం, గుండాటలు చట్ట విరుద్ధమని. నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఇవేమీ పట్టని కొందరు భోగి రోజునే రాజోలు మండలం వ్యాప్తంగా సోమవారం కోడిపందేలు, గుండాటలకు తెరదీశారు. రాజోలు, శివకోటి, సోంపల్లి బి. సావరం వేగవారిపాలెం గ్రామాల్లో జోరుగా సాగాయి.