మలికిపురం మండలంలోని లక్కవరం నుంచి శంకరగుప్తం వెళ్లే రహదారి కిలోమీటర్ మేర పెద్దపెద్ద గోతులు పడి పూర్తిగా అధ్వానంగా మారింది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోతుల్లో వర్షపు నీరు నిలిచి చెరువును తలపిస్తుంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అదుపుతప్పి గోతులలో పడి గాయపడుతున్నారని స్థానికులు సోమవారం చెప్పారు. అధికారులు స్పందించి కనీస మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.