మలికిపురం మండల తహశీల్దార్ గా బండి మృత్యుంజయరావును నియమిస్తూ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల అనంతరం జరిగిన తహసీల్దారుల బదిలీల్లో భాగంగా ఈనెల 9వ తేదీన మృత్యుంజయరావు పి. గన్నవరం మండల తహశీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయనను మలికిపురానికి మార్చారు. పి. గన్నవరానికి మరొకరిని నియమించలేదు.