తుని: ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలి
తుని రామకృష్ణ కాలనీలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిద్ధాంతపు సత్తిబాబు వినతిపత్రం అందజేశారు. రామకృష్ణ కాలనీలో 5 నుంచి 14 సంవత్సరంలోపు పిల్లలు 374 మంది ఉన్నారన్నారు. కాలనీకి కిలోమీటరు పరిధిలో ప్రభుత్వ పాఠశాల లేక కాన్వెంట్లో చదివించే స్తోమత లేక విద్యార్థులు తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.