ఎన్డీయే ప్రభుత్వ సహకారంతో విస్తృత గ్రామీణ అభివృద్ధి జరుగుతుందని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం మోపిదేవి మండలం బొబ్బర్లంకలో నూరు శాతం సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి నిధులు సుమారు రూ. కోటితో 18 సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. వరద ప్రభావిత గ్రామాలకు నూరు శాతం సీసీ రోడ్లు మంజూరు చేసిన ప్రభుత్వానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.