విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేత

54చూసినవారు
మోపిదేవి గ్రామ సిపిఐ సీనియర్ నాయకులు కంఠమనేని అచ్యుతరామయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాలు ప్రధానం చేశారు. మోపిదేవి జడ్పీ హైస్కూల్ జరిగిన కార్యక్రమంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు వన్నెం రెడ్డి లావణ్య, (ప్రధమ) జి. జాషువా (ద్వితీయ), పెద సింగు హేమ (తృతీయ) లకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల నగదు, మూడు సైకిళ్ళు బహుమతులను అందజేశారు.

సంబంధిత పోస్ట్