రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయంగా విరాజిల్లుతున్న మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడ్డారు. తొలుత నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు పర్యవేక్షించారు.