అవనిగడ్డలో వేంచేసియున్న రాజరాజేశ్వరీ సమేత శ్రీ రాజశేఖర స్వామి వారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దివి ప్రాంతానికి చెందిన సీనియర్ న్యాయవాది వల్లభనేని రామారావు కృష్ణకుమారి దంపతులు రూ. 1, 12, 900 విలువైన కంఠాభరణాన్ని సమర్పించారు. శనివారం ఉదయం రామారావు దంపతులు ఈ ఆభరణాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ వాసు కు అందచేయగా వేద పండితులు అమ్మవారికి ఆ ఆభారణాన్ని అలంకరించారు.