ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కృషితో లంక రైతులను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఆదుకుందని జనసేన నాయకులు శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం అవనిగడ్డలో బుద్ధప్రసాద్ ను శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చల్లపల్లి మండలం వెలివోలు పరిధిలోని సీడేపూడి లంక రైతులు కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు. మల్బరి రైతులకు హెక్టారుకు రూ. 25 వేలు, పసుపు, అరటి, కందకు హెక్టారుకు రూ. 35 వేలు చొప్పున నష్ట పరిహారం మంజూరు చేయించారని వివరించారు.