గోగినేనిపాలెం: భారత రాజ్యాంగ పరిరక్షణకు అందరూ పాటుబడాలి
ఘంటశాల మండలం గోగినేనిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేణుగోపాలరావు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆశయాల సాధన కోసం అందరూ కృషి చెయ్యాలని, రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ పాటుబడాలని సూచించారు. అందరి చేత భారత రాజ్యాంగ ప్రతిజ్ఞను చేయించారు.