బాపులపాడు మండలం కోడూరుపాడు, శోభనాద్రిపురం గ్రామాల్లో మాత్రం కరెంట్ వైర్ల దొంగలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గత మూడు నెలలు నుంచి దొంగలు బెడద బెంబేలెత్తుతున్నారు. దొంగలు విద్యుత్తు వైర్లు చోరీకి పాల్పడటం ద్వారా వేలాది రూపాయలు నష్టపోతున్నామని అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు.
ఆదివారం ఒక్క రోజే 25 మోటార్లు (బోర్ వేల్) కేబుల్ వైర్లు దొంగతనం చేశారు.