గన్నవరం తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫై దారి కేసులో మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ అనుచరులకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నాటకీయ పరిణామములో గన్నవరం పోలీసులు మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ అనుచరులు 8 మందిని అదుపులోకి తీసుకొని మంగళవారం కంకపాడు పోలీస్ స్టేషన్ కి తరలించారు. వీరిని బుధవారం తెల్లవారుజామున గన్నవరం న్యాయస్థానం న్యాయమూర్తి ఎదుట హాజరపరచుగా 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.