మైలవరం: గోకులాల నిర్మాణంతో చిన్న, సన్నకార రైతులకు ప్రయోజనం

72చూసినవారు
మైలవరం నియోజకవర్గంలో 137 గోకులాల నిర్మాణానికి కాను రూ. 2. 87 కోట్లు మంజూరు చేసినట్లు స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు వెల్లడించారు. మైలవరం మండలం జంగాలపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నూతనంగా నిర్మాణం పూర్తయిన గోకులాన్నీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాకతో రైతులకు మంచి రోజులు వచ్చాయన్నారు.

సంబంధిత పోస్ట్