ముదినేపల్లిలో గ్రామ రెవెన్యూ సదస్సు
ముదినేపల్లి మండలం పెద్దపాలపర్రులో శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామ్ ప్రకాష్ సిసోడియా, జాయింట్ కలెక్టర్ ధరిత్రి రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గ్రామ రెవెన్యూ సమస్యలపై నాయకులతో మరియు గ్రామస్థులతో చర్చించారు. అలాగే గ్రామ రెవెన్యూ సదస్సులను ప్రజలు మరియు రైతుల సద్వినియోగం చేసుకోవాలన్నారు.