కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఓ వ్యక్తి వరుసగా నాలుగు పందేలు గెలిచారు. దీంతో ఆయనకు కొత్త బుల్లెట్ బైక్ మంగళవారం దక్కింది. ఈ మేరకు బైక్ తీసుకుని నడుపుకుంటూ వెళ్లిపోయారు. సమీప ఆలయం వద్ద పూజలు చేయించి తన గెలుపునకు గుర్తుగా బైకుతో ఊరంతా తిరిగారు. తమ కోళ్లు నాలుగు పందేలను గెలవడంపై ఆనందం వ్యక్తం చేశారు. కోడి పందెం గెలిచి బుల్లెట్‌పై రయ్ రయ్ అంటూ తిరుగున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.