మచిలీపట్నం: పేర్ని నాని గోడౌన్- కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యం
By A.R. Prasad 54చూసినవారుపేదల బియ్యాన్ని బొక్కేసిన పేర్ని నాని రేషన్ బియ్యం మాయం కేసులో అడ్రస్ లేకుండా పారిపోయాడని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. సోమవారం మచిలీపట్నంలో అయన మాట్లాడుతూ, పోలీసులు నోటీసులు ఇచ్చినా సమాధానం చెప్పకుండా పారిపోయాడంటే తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టేనన్నారు. ఇటీవల నానికి చెందిన గోడౌన్లో మాయమైన 5వేల బస్తాల రేషన్ బియ్యం కాకినాడ పోర్టుకు అక్రమంగా తరలించినట్టు పోలీసుల విచారణలో తేలిందన్నారు.