మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని శిక్షించాలి

54చూసినవారు
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని శిక్షించాలి
మచిలీపట్నంలో గుమస్తాల కాలనీలో నివాసముంటున్న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మచిలీపట్నం నగర కార్యదర్శి కొడాలి సుజాత రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మచిలీపట్నంలో ఆమె మాట్లాడుతూ మచిలీపట్నంలో మైనర్ బాలిక పై జరిగిన బెదిరింపు, అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు మరలా జరుగకుండా చూడాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్