రైతు కష్టపడి పండించిన పంటను ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రైతులను కోరారు. గురువారం మంత్రి కృష్ణాజిల్లా పర్యటనలో భాగంగా పామర్రు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వర్ల కుమార్ రాజాతో కలసి కనుమూరు, కొండాయపాలెం, అడ్డాడ గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడారు. ధాన్యం రాశులను పరిశీలించి రైతుల ఇబ్బందులను మంత్రి అడిగి తెలుసుకున్నారు.