పెడన బల్లిపర్రు పంచాయతీ పరిధిలో 29 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ చెప్పారు. శనివారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం పనుల వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు.