బంటుమిల్లి మండలం చిన్న తుమ్మిడి పంట కాలువ తూడు గడ్డితో నిండిపోవడం వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడింది. సాగునీరు అందక వరి పంటలు దెబ్బతింటున్న తరుణంలో, గ్రామ ఎంపీపీ వెలివెల చినబాబు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా తూడు తొలగింపు చర్యలు చేపట్టారు. బుధవారం, రైతులతో కలిసి స్వయంగా కాలువలోకి దిగి తూడు తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు, సాగునీరు అందించాలని నిర్ణయించారు.