ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ వారు ఏర్పాటు చేసిన దృశ్యమాలికను పరిశీలించారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గం లోని కంకిపాడు మండలం గొడవరు గ్రామంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నటువంటి రహదారుల దృశ్యమాలికను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు