రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ సోమవారం కంకిపాడు పట్టణానికి చేరుకున్నారు. కంకిపాడు మండలం గొడవరు గ్రామంలో సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించేటటువంటి రహదారుల నిర్మాణ పనులను పరిశీలించిన కోసం వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ కు కంకిపాడు సరిహద్దులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెనమలూరు శాసనసభ్యులు బోడె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.