గంపలగూడెం మండలం పెనుగొలను లో సోమవారం శిరిడిసాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆథ్యాత్మిక గురువు,సంగీత కారుడు కనకదాసు జయంతి నిర్వహించారు.ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కీర్తనల ద్వారా సమాజంలోని అసమానతల్ని రూపుమాపి, ప్రజలను చైతన్య పరిచిన కనకదాసు గొప్ప ఆధ్యాత్మిక గురువు అని రాష్ట్ర పండుగగా కనకదాసు జయంతిని నిర్వహిస్తున్నారని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ కార్యదర్శి రంగు సత్యనారాయణ తెలిపారు.