రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా త్వరలో జిల్లాలో నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్) ప్రక్రియ సజావుగా జరిగేందుకు పూర్తి స్థాయిలో సిద్దం కావాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డా. నిధిమీనా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్ నిధి మీనా ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.