వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా నూతనంగా నియమితులైన తోపుల వరలక్ష్మి శనివారం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు మల్లాది విష్ణు తన అభినందనలు తెలిపారు. పార్టీ పటిష్టతకు పాటుబడే ప్రతీ కార్యకర్తకు దశలవారీగా సముచిత స్థానం కల్పిస్తామని మల్లాది విష్ణు అన్నారు.