విజయవాడ: ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
By KOLA 82చూసినవారుప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రశాంత వాతావరణంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. ఈ నెల 27న ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా కలెక్టర్ లక్ష్మీశ సోమవారం నగరంలోని పటమట బాలుర ఉన్నత పాఠశాల, లయోలా కళశాలలోని వివిధ పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేశారు.