గనుల శాఖ మాజీ డైరెక్టర్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏపీలో గనులశాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డిని విజయవాడ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాదులో ఆయనను అదుపులోకి విజయవాడ గొల్లపూడి ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిగిన అనంతరం విజయవాడ కోర్టులోహాజరు పర్చనున్నారు. గత ప్రభుత్వంలో గనుల శాఖలో టెండర్లు, ఇసుక తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలున్నాయి.