ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం విజయవాడ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆరేడు నెలలకు ఒకసారి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే ధోరణికి స్వస్తి పలికామని అన్నారు. భర్త చనిపోతే వెంటనే భార్యకు ఏ నెలకు ఆనెలే పింఛను ఇచ్చే విధానాన్ని అమలులోకి తెచ్చామని తెలిపారు.