నిత్యం ప్రజలు సంచరించే, జనావాసాల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కు ఆదివారం అవనిగడ్డలో ఘంటసాల గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. మల్లంపల్లి రోడ్డులో మద్యం షాపు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని, మేము తీవ్రంగా ఇబ్బంది పడతామని తెలిపారు. మద్యం షాపు ఊరు బయటకు మార్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.