శిలాఫలకాలు పడగొట్టే సంస్కృతి తమది కాదు: టీడీపీ

78చూసినవారు
శిలాఫలకాలు పడగొట్టే సంస్కృతి తమది కాదని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, టిడిపి జిల్లా నాయకులు బండే రాఘవ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని కోడూరు రోడ్డులో శిలాఫలకం పడిపోయిన స్థలాన్ని టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ శిలాఫలకం పడిపోయి దాదాపు ఇరవై రోజులు దాటిందని, దాని చుట్టూ పిచ్చి మొక్కలు కూడా దట్టంగా పెరిగిపోయి ఉన్నాయని టిడిపి నాయకులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్