కోడూరు మండలం నరసింహాపురం గ్రామ సమీపంలో లింగన్నకోడు మీడియం డ్రైనేజీపై నూతనంగా నిర్మించిన వంతెనను ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మంగళవారం ప్రారంభించాంరు. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో ఇచ్చిన నిధులు రూ. 18 లక్షల 40 వేలు, ఎంపీ వల్లభనేని బాలశౌరి ఇచ్చిన నిధులు రూ. 25 లక్షలతో ఈ వంతెన నిర్మించారు. స్థానిక కూటమి నాయకులు, అధికారులకు రైతులు పాల్గొన్నారు.