టీడీపీ నేతకు చెందిన అరటి తోట నరికివేసిన సంఘటన మోపిదేవి మండలం కే. కొత్తపాలెం గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. టీడీపీ నేత దుట్టా రవీంద్రనాధ్ ఠాగూర్ అరటి తోటను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు అరటి తోట పరిశీలించి కేసు నమోదు చేశారు. ఠాగూర్ అరటి తోట అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.