Nov 28, 2024, 02:11 IST/హుజురాబాద్
హుజురాబాద్
ఉప్పల్ ఆర్వోబీ పనులు పూర్తి చేయాలని కేంద్ర మంత్రికి వినతి
Nov 28, 2024, 02:11 IST
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఉప్పల్‌లో పెండింగ్‌లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్వోబీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు ఢిల్లీలో అశ్వినీ వైష్ణవ్‌ను ఈటల కలిసి బుధవారం వినతి పత్రం అందజేశారు. అదే విధంగా కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే పాసులు పునరుద్ధరించాలని కోరారు.