Oct 28, 2024, 15:10 IST/
కమ్యూనిస్టులు ఉద్యమాలు చేపట్టాలి: తమ్మినేని
Oct 28, 2024, 15:10 IST
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత గ్యారెంటీ పథకాల పేరుతో అధికారంలోకి వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఎన్నికలలో ప్రకటించిన ఉచిత గ్యారెంటీ పథకాల అమలు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఇప్పటివరకు స్నేహపూర్వకంగా చెప్పాం..ఇక నుండి రోడ్ల పైకి వస్తాం అంటూ హెచ్చరించారు. మాకు గెలవడం రాకపోయినా ఓడించడం వచ్చు అంటూ తమ్మినేని హాట్ కామెంట్స్ చేశారు.