అంగన్వాడీ కేంద్రంలో పోషక మాసోత్సవ వేడుకలు
బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గర అంగన్వాడీ కేంద్రంలో గురువారం పోషక మాసోత్సవ వేడుకలు గన్నవరం ఐసిడిఎస్ సూపర్వైజర్ కొండవీటి ధనలక్ష్మి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలలకు అన్న ప్రాసనలు, గర్భిణీ స్త్రీలకు శీమంతాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిపల్లి కమలాబాయ్, అంగన్వాడీ టీచర్లు సీతాకుమారి, ధనలక్ష్మి పాల్గొన్నారు.