Apr 26, 2025, 08:04 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
తంగళ్ళపల్లి: మేడేను విజయవంతం చేయాలి: రమణ
Apr 26, 2025, 08:04 IST
మే 1న జరిగే మేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ అన్నారు. తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో 139వ మే డే పోస్టర్ ను శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్ లో మే 1వ తేదీన మేడే బహిరంగ సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున కార్మికులు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.