తప్పుడు ప్రకటనలను సహించేది లేదని గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరించారు. బుధవారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దెయ్యాలు వేదాలు వర్ణించినట్లు గన్నవరం జడ్పీటీసీ సభ్యురాలు ఎలిజబెత్‌రాణి మాట్లాడుతున్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. జడ్పీటీసీగా గెలిచిన మూడేళ్ల కాలంలో ఒక్క రోడ్డు నిర్మాణం, ప్రజాసమస్యను పరిష్కరించారా అని మండిపడ్డారు.