రాష్ట్ర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బుధవారం గన్నవరం బస్ డిపో నుండి తిరుపతి, జగల్దాపూర్ రూట్ లకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నూతన సర్వీస్ లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.