రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటన ఆదివారం గన్నవరం నియోజకవర్గంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం నూజివీడుకి చెందిన భవాని భర్త అనారోగ్యంతో పెదఔటుపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. దీంతో అతడిని చూసేందుకు భవానితో పాటు పద్మకుమారి ఆదివారం ఆసుపత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఆసుపత్రి సమీపంలో రోడ్డు దాటు తుండగా వారిని ఓ బైక్ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు.