క్రీస్తు దేవుని కృపతో సర్వ మానవాళి సుఖసంతోషాలతో జీవించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ఏలూరు రోడ్డులోని వికేఆర్, వి. ఎన్. బి ఆడిటోరియం ప్రాంగణంలో సోమవారం గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవ విశ్వాసులు, దైవ సేవకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాము సెమీ క్రిస్మస్ కి కట్ చేసి దైవ సేవకులకు తినిపించారు.