జగ్గయ్యపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని జగ్గయ్యపేట, వత్సవాయి మండలాలలోని వివిధ గ్రామాలలోని 78 బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేయటం జరిగిందని జగ్గయ్యపేట ఎక్సైజ్ బి. గురవయ్య తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ సందర్భంగా 80 మంది బెల్ట్ షాపు నిర్వాహకులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 339 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసు కోవటం జరిగిందని ఎక్సైజ్ సిఐ గురవయ్య తెలిపారు.