కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని చిల్లకల్లు ఎస్ఐ మోగ్యా నాయక్ పిలుపునిచ్చారు. సోమవారం తెల్లవారుజామున జగ్గయ్యపేట మండలం ధర్మవరప్పాడు తండా గ్రామపంచాయతీ పరిధిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహించటం కోసం కబడీ పోటీలను ఎస్ఐ మోగ్యా నాయక్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చిల్లకల్లు ఎస్ఐ మోగ్యా నాయక్ కబడీ ఆటగాళ్లతో పాటు ఆటగాళ్లను ఉత్సాహపరచారు.