ప్ర‌చారంలో పాల్గొన్న కేశినేని శివ‌నాథ్, సుజ‌నా చౌద‌రి

20554చూసినవారు
ప్ర‌చారంలో పాల్గొన్న కేశినేని శివ‌నాథ్, సుజ‌నా చౌద‌రి
జ‌గ‌న్ లాగ ముందొక మాట‌...గెలిచిన త‌ర్వాత మాట మార్చ‌టం తెలుగుదేశం పార్టీకి, నాయ‌కుల‌కి అల‌వాటు లేదు. జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాలు ఇస్తాన‌ని చెప్పి..గెలిచిన త‌ర్వాత క‌రెంట్ బిల్లు ఎక్కువ రాకుడ‌దు. ద్విచ‌క్ర వాహ‌నం వుండ‌కూడ‌దు..వుంటే సంక్షేమ ప‌థ‌కాలు రావంటూ కండీష‌న్స్ పెట్టాడు. ఎన్డీయే కూట‌మి అధికారంలోకి రాగానే చంద్ర‌బాబు అమ‌లు చేయ‌బోయే సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలకు ఎలాంటి కండీష‌న్స్ వుండ‌మ‌ని...అర్హులైన పేద ప్ర‌జ‌లంద‌రికీ సంక్షేమం అంద‌జేస్తామి బిజెపి, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ అభ్య‌ర్థి కేశినేని శివ‌నాథ్ చెప్పారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం కంటే ముందు క‌బేళా సెంట‌ర్ నందు 45వ డివిజ‌న్ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌ధాన కార్యాల‌యాన్నిమంగ‌ళ‌వారం కేశినేని శివ‌నాథ్, సుజ‌నా చౌద‌రి క‌లిసి ప్రారంభించారు. ఆ త‌ర్వాత ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గం 45వ డివిజ‌న్ కేబేళా సెంట‌ర్, సితార రోడ్ లో కేశినేని శివ‌నాథ్, బిజెపి ఎమ్మెల్యే అభ్య‌ర్థి సుజ‌నా చౌద‌రి తో క‌లిసి ఇంటింటికి ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారం సితార సెంట‌ర్ నుంచి మొద‌లై రాజాగారి ప్లాట్స్, జోజిన‌గ‌ర్, రోట‌రీ న‌గ‌ర్, కొండమూల చ‌నుమోలు వెంక‌ట్రావు ఫై ఓవ‌ర్ కింద ప్రాంతం వ‌ర‌కు సాగింది. ఈ ప్ర‌చారంలో భాగంగా కబేళా సెంట‌ర్ లోని క‌ళ్యాణ్ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవ‌స్థానం ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఇంటింటికి వెళ్ల‌టంతోపాటు, మొయిన్ రోడ్ పై వున్న షాపుల‌కి కూడా వెళ్లి రెండు ఓట్ల‌లో ఒక ఓటు క‌మ‌లం గుర్తుపై, ఇంకో ఓటు సైకిల్ గుర్తుపై వేసి త‌మ‌ని గెలిపించాల‌ని కోరారు.

ఈ సంద‌ర్భంగా కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ వైసిపి మేనిఫెస్టో ఆపార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే నీర‌సం తెప్పించిందన్నారు. జ‌గ‌న్ దృష్టి అంతా మూడు రాజ‌ధానుల‌పైనే వుందనే విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ అర్ధ‌మైపోయింద‌ని...అందుకే ఈసారి ఎన్డీయే అభ్యుర్దుల్ని భారీ మెజార్టీతో గెలిపించేందుకు సిద్దంగా వున్నార‌ని చెప్పారు. మ‌రో పదిహేను రోజుల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ప్ర‌జ‌ల తీర్పు ఇప్ప‌టికే అర్ధ‌మైపోయింది. జ‌గ‌న్ ఇప్ప‌టికీ త‌న ధోర‌ణి మార్చుకోలేదు. ఓట్లు చీల్చేందుకు కొత్త ప‌న్నాగాలు ప‌న్నుతున్నాడు. జ‌గ‌న్ ఎన్ని కుయుక్తుల‌తో వ‌చ్చినా ప్ర‌జ‌లు అవగాహ‌న‌తో వున్నారు. జ‌గ‌న్ ఆట‌లు ప్ర‌జ‌లు ముందు సాగ‌వన్నారు. ప్ర‌జ‌లంద‌రూ చంద్ర‌బాబు రావాలి. త‌మ పిల్ల‌ల భ‌విష్యత్తు బాగుండాలి. సంక్షేమం కావాలి. అమరావ‌తి కావాల‌ని కోరుకుంటున్నారని తెలిపారు.

అనంత‌రం సుజ‌నా చౌద‌రి మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ రూపురేఖలు మార్చేందుకు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తున్నామని, ఇందులో పొందుపరిచిన హామీలన్నీ నూటికి నూరు శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని, చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్న పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తాన‌ని, అలాగే మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటాన‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ పార్టీ ప్రెసిడెంట్ పెరం స‌త్య‌నారాయ‌ణ‌, మాజీ డివిజ‌న్ పార్టీ ప్రెసిడెంట్ దేవ‌ర కొండ చ‌క్ర‌వ‌ర్తి, రాష్ట్ర ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ ఎమ్.ఎస్.బేగ్, రాష్ట్ర అధికార ప్ర‌తినిధి కె.నాగుల్ మీరా, రాష్ట్ర తెలుగు మ‌హిళ సంఘం కార్య‌ద‌ర్శి తుపాకుల ర‌వ‌ణ‌మ్మ‌, డివిజ‌న్ పార్టీ సెక్ర‌ట‌రీ సుభానీ, వైస్ ప్రెసిడెంట్ భ‌ర‌త్ కుమార్, బూత్ క‌మిటీ స‌భ్యులు మ‌నోహ‌ర్, వీరారెడ్డి, జ‌న‌సేన‌పార్టీ డివిజ‌న్ అధ్య‌క్షురాలు బొమ్ము గోవింద ల‌క్ష్మీ, జ‌న‌సేన పార్టీ సీటి జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ లింగం శివ‌, బిజెపి నాయ‌కులు పైలా సోమినాయుడు, బిజెపి డివిజ‌న్ అధ్య‌క్షురాలు చ‌ల్లా ర‌మాదేవిల‌తో పాటు బిజెపి,టిడిపి, జ‌న‌సేన నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్