అబద్ధాన్ని అమ్మగలిగే టాలెంట్ చంద్రబాబుకే సొంతం: జగన్

83చూసినవారు
అబద్ధాన్ని అమ్మగలిగే టాలెంట్ చంద్రబాబుకే సొంతం: జగన్
అబద్ధాన్ని అమ్మగలిగే టాలెంట్ కేవలం సీఎం చంద్రబాబుకే సొంతమని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. వరదలను ఎలా మేనేజ్ చేయాలో కూటమి ప్రభుత్వానికి తెలియదన్నారు. పిఠాపురంలో పర్యటించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది. ఈ నాలుగు నెలల్లో ఎక్కడేం జరిగినా జగనే కారణమని చంద్రబాబు అంటున్నారు. ఆయన జగన్ నామజపం మాని ప్రజల గురించి ఆలోచించాలి.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్