మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని సోమవారం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటలు పని చేసే విధంగా వైద్యులు, ఇతర వైద్య ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. కావలసిన మందులతో పాటు పాము కాటు నివారణ మందు కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.