మాజీ మంత్రి నిర్వాకంతో రూ. 71 కోట్లు నిలిచిపోయాయి: మంత్రి

76చూసినవారు
మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నాని నిర్వాకంతో కేంద్రం నుంచి అమృత్ స్కీం కింద రావల్సిన రూ. 71కోట్లు నిలిచిపోయాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. శుక్రవారం మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 71కోట్లకు మ్యాచింగ్ ఫండ్ పెట్టడానికి మున్సిపాల్టీలో తీర్మానం చేయకపోవడంతోనే నిధులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. ఐదేళ్లలో మున్సిపాల్టీకి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోయారని ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్