18నెలల చిన్నారి మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందిన మహ్మద్ అబ్బాస్ ఈ నెల 19న తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి అత్తింటికి వెళ్ళాడు. అదేరోజు చిన్నారి ఆడుకుంటూ వాష్ రూమ్ కి వెళ్ళింది. బాటిల్ ఉన్న యాసిడ్ చూసి మంచి నీళ్లు అనుకోని తాగేసింది. కుటుంబసభ్యులు చిన్నారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.